క్యాబేజీ ని పొరలు పొరలుగా విదదీసి వేడి నీళ్ళలో వేసి కాసేపు ఉడికించాలి.
స్టపింగ్ కోసం స్టవ్ ఫై కడాయి పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిగడ్డలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, పుట్ట గొడుగులు వేసి వేయించిన తరువాత వీటిని మరొక గిన్నెలో తీసుకోని దానిలో కీమా లాగా ఉన్న చికెన్, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమిర, టమాటో రసం, సోయాసాస్ వేసి అన్నింటిని బాగా కలియపెట్టాలి.
క్యాబేజీ పొరలను తీసి ఆరపెట్టి దానిలో ఫై మిశ్రమాన్ని ముద్దలాగా పెట్టి మనకు నచ్చిన ఆకారంలో మడుచుకోవాలి అనగా కోన్ ఆకారంలో మడుచుకోవాలి.
వీటిని ఓవెన్ ఉంటె పరవాలేదు లేకుంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసి దానిమీద సన్నని జాలి పెట్టి దానిలో ఈ క్యాబేజీ చుట్టలను పెట్టి ఆవిరికి 15 నిమిషాల పాటు పెట్టాలి.