Turai Chana Dal recipe | Turai | బీరకాయ శెనగపప్పు కూర
తయారికి కావలసిన పదార్థాలు :
బీరకాయ : 200 గ్రా
టమాటో : 2
పచ్చిమిర్చి : 8
తరిగిన ఉల్లిగడ్డ : 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము : 1/2 కప్పు
ఉడికించిన శెనగ పప్పు : 1 కప్పు
కరివేపాకు , కొత్తిమిర
పసుపు, ఉప్పు : తగినంత
ఆవాలు, జీలకర్ర : 1 స్పూన్
నూనె
తయారు చేయు విధానం :
స్టవ్ ఫై గిన్నె పెట్టి కురకి తగినంత నునె వేసి వేడెక్కాక ఆవాలు, జిలకర, తరిగిన ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసి వేగాక పచ్చిమిర్చి వేసి తరిగిన బీరకాయ, కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి.
ఇలా మగ్గుతున్న కూరలో తరిగిన టమాటో ముక్కలను వేసి కాసేపు మగ్గనివ్వాలి, ఇపుడు ఉడికించిన శెనగ పప్పును వేసి తగినంత నీళ్ళు పోసి మగ్గనివ్వాలి.
తరువాత పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపాక కూరకి తగినంత ఉప్పు వేసి చివరగా కొత్తిమిరను చల్లి స్టవ్ కట్టేయాలి.