స్టవ్ ఫై కడాయి పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగిన తరువాత ఉల్లిగడ్డ ముక్కలు, తరిగిన వెల్లుల్లి రిబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కాజులు వరుసగా ఒకదాని తరువాత మరొకటి వేస్తూ ఉండాలి.
ఇప్పుడు పుట్టగొడుగులు వేసి కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. 2 నిముషాలు మూత పెట్టకుండా కలుపుతూ ఉంచి జీలకర్ర పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు, కారం వేసి కలిపి కాసేపు మగ్గనివ్వాలి .వేయించి పొడి చేసుకున్న పల్లీ పొడి చల్లుకోవాలి.
చివరగా ధనియాల పొడి, కొత్తిమిర చల్లుకొని స్టవ్ కట్టేయాలి.