Advertisement

Main Ad

Onion Paratha | Pyaaz Ka Paratha | Indian Paratha Recipe

Onion Paratha | Pyaaz Ka Paratha |  Indian Paratha Recipe

తయారికి కావాల్సిన పదార్థాలు :

  1. గోధుమ పిండి : 2 కప్పులు
  2. తరిగిన ఉల్లిగడ్డలు :  2 కప్పులు
  3. కొత్తిమిర , పుదినా : 1 కప్పు
  4. ఉప్పు , కారం : తగినంత
  5. పచ్చిమిర్చి : 3
  6. గరం మసాలా పొడి : 1/2 స్పూన్
  7. ధనియాల పొడి : 1/2 స్పూన్  
  8. నూనె
  9. వెన్న
  10. అల్లం ముక్కలు : 1 స్పూన్

తయారు చేయు విధానం :

  • ఒక బౌల్ లో తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసి వాటిని బాగా వత్తేసి వాటి నుండి ఉల్లి రసాన్ని తిసి పక్కనపెట్టుకోవాలి.
  • ఈ ఉల్లిరాసాన్ని గోధుమ పిండి కలపడానికి కూడా వాడవచ్చు లేక మాములుగా ఎలా చెపాతి పిండి కలుపుతమో అలానే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • రసాన్ని తీసిన ఉల్లి తురుములో తరిగిన కొత్తిమిర, పుదినా, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పచ్చిమిర్చి, సరిపడినంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
  • తడిపిన పిండిలో చిన్న ముద్ద తీసుకోని అందులో ఉల్లి మిశ్రమాన్ని కొంచెం పెట్టి ముద్దను మూసి వేసి చెపాతి లాగా పొడి పిండి వేసి చేసుకోవాలి.
  • స్టవ్ ఫై పెనం పెట్టి అది వేడి అయ్యాక వెన్నతో ఈ ఉల్లిపార్థ ను దోరగా కాల్చుకోవాలి.
  • వీటిని వేడిగా ఉన్నప్పుడే తింటే చాల రుచిగా ఉంటాయి.