స్టవ్ ఫై కడాయి పెట్టి 4స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి వేగాక కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి, పసుపు, తరిగిన ఉల్లిగడ్డలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత అల్లం వెల్లులి పేస్టు, కాప్సికం ముక్కలు, టమాటో పేస్టు వేసి కలిపాక వరసగా మిరియాల పొడి, ధనియాల్ పొడి, గరం మసాలా పొడి, కారం వేసి కలిపాక కట్ చేసుకున్న పుట్టగొడుగులను వేసి కలుపుకోవాలి.
సరిపడినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోని 4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
మరొక చిన్న కడాయి స్టవ్ ఫై పెట్టి దానిలో 2 స్పూన్స్ వెన్నె వేసి వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమిర వేసి కలిపాక ఈ పోపు ను పుట్టగొడుగుల కూర లో వేసి కలుపుకోవాలి.