Mushroom Masala With Panneer | Recipe for Mushroom
తయారికి కావాల్సిన పదార్థాలు :
పుట్టగొడుగులు : 150 గ్రా
పనీర్ : 150 గ్రా
పచ్చి బటాని : 50 గ్రా
టామాటో పేస్టు : 2 కప్పు లు
ఫ్రెష్ క్రీం : 4 స్పూన్స్
అల్లం వెల్లులి పేస్టు : 2 స్పూన్
కాజు పవర్ : 1/2 కప్పు
ధనియాల పొడి : 2 స్పూన్స్
గరం మసాలా పొడి : 1 స్పూన్
కసూరి మేతి పొడి : 1 స్పూన్
పసుపు , ఉప్పు , కారం : తగినంత
వెన్న : 3 స్పూన్స్
నూనె : 2 స్పూన్స్
కొత్తిమీర
తయారు చేయు విధానం :
స్టవ్ ఫై కడాయి పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపిన తరువాత టమాటో పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో వెన్న కూడా వేసి బాగా నూనె మీదికి వచ్చేంతవరకు టమాటో పేస్టు ను కలుపుతు ఉండాలి, ఇందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కసూరి మేతి పొడి ఒక దాని తరువాత మరొకటి వేస్తూ కలుపుతు ఉండాలి, అవసరం ఇతే కొన్ని నీళ్ళు పోసి మగ్గించుకోవాలి.
ఇపుడు తరిగిన పుట్టగొడుగులు, పన్నీర్ ముక్కలను మరియు పచ్చి బటాని కూడా వేసి 2 నిముషాలు మగ్గిన తరువాత కొన్ని నీళ్ళు పోసి, కాజు పొడిను కూడా వేసి కలిపి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.