Coriander Mint Chutney | Mint Coriander Chutney | Green Chutney
తయారికి కావలసిన పదార్థాలు :
పుదినా : 2 కప్పులు
కొత్తిమీరా : 2 కప్పులు
మినపప్పు : 1/2 కప్పు
శెనగ పప్పు : 1/2 కప్పు
చింతపండు : రుచికి తగినంత
పసుపు : 1 స్పూన్
ఉప్పు : తగినంత
పచ్చిమిర్చి : 8
ఎండుమిర్చి : 2
అల్లం ముక్కలు : 1 స్పూన్
వెల్లుల్లి రిబ్బలు : 5
జీలకర్ర ; 1 స్పూన్
నూనె
తయారు చేయు విధానం :
స్టవ్ ఫై కడాయి పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి అందులో మినపప్పు, శెనగ పప్పు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకున్నాక వాటిని తీసి మిక్స్ జార్లో వేసాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
వీటిని తీసి పుదినా, కొత్తిమీరాను, పసుపు వేసి పచ్చి వాసన పోయే అంత వరకు వేయించుకోవాలి.
చింతపండును నీళ్ళలో వేసి నానపెట్టుకోవాలి.
పప్పులను మిక్స్ చేసాక పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి ఆకులను, చింతపండు, సరిపడినంత ఉప్పు వేసి వీటిని బాగా మెత్తగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి.