Advertisement

Main Ad

Mint Chuney with Red Chilli | పుదీనా ఎండుమిర్చి చట్నీ

Mint Chutney with Red Chilli | పుదీనా ఎండుమిర్చి చట్నీ


తయారికి కావలసిన పదార్థాలు :

  1. పుదీనా : 2 కప్పులు
  2. నువ్వులు : 1/2 కప్పు
  3. చింతపండు : పులుపుకి తగినంత
  4. ఎండుమిర్చి : 8
  5. జీలకర్ర : 1 స్పూన్
  6. వెల్లుల్లి రిబ్బలు : 6
  7. ధనియాలు : 2 స్పూన్స్
  8. పసుపు, ఉప్పు
  9. నూనె

తయారీ చేయు విధానం : 

  • స్టవ్ ఫై కడాయి పెట్టి 1/2 కప్పు నువ్వులను వేసి దోరగా వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. 
  • అదే కడాయి లో 4 స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, వెల్లులి రిబ్బలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకున్నాక వాటిని తీసి మిక్స్ జార్ లో వేసి మరల అదే కడాయి లో 2 స్పూన్స్ నూనె వేసి కడిగి ఆరపెట్టిన పుదినా ఆకులను వేసి పచ్చి వాసనా పోయే అంత వరకు వేయించుకున్నాక అందులో చింతపండు వేసి పసుపు, సరిపడినంత ఉప్పు వేసి కలిపి మిక్స్ జార లో వేసి మెత్తగా మిక్స్ చేసుకోవాలి.
  • ఇష్టం ఉంటె పోపు దినుసులు వేసి పోపు పెట్టుకోవచ్చు.