Advertisement

Main Ad

Mint Tomato Chutney | పుదీనా టమాటో చట్నీ

Mint Tomato Chutney | పుదీనా టమాటో చట్నీ


తయారికి కావాల్సిన పదార్థాలు :

  1. పుదీనా : 2 కప్పులు
  2. టమాటో : 1 కప్పు
  3. పచ్చిమిర్చి : 4
  4. ఎండుమిర్చి : 3
  5. నువ్వులు : 1/2 కప్పు
  6. చింతపండు : పులుపుకి తగినంత
  7. జీలకర్ర : 1 స్పూన్
  8. పసుపు , ఉప్పు
  9. వెల్లులి రిబ్బలు : 6
  10. నూనె

తయారు చేయు విధానం :

  1. స్టవ్ ఫై కడాయి  పెట్టి మొదటగా నువ్వులు దోరగా వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
  2. అదే కడాయి లో కొద్దిగా నూనె పోసి జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రిబ్బలు చింతపండు వేసి వేయించుకున్నాక  పుదినా, పచ్చిమిర్చి వేసి 5 నిమిషాల పాటు మగ్గించుకున్నాక చివరగా టమాటో వేసి మగ్గినతరువాత సరిపడినంత ఉప్పు వేసి స్టవ్ కట్టేయాలి.
  3. తరువాత మిక్స్ జర లో అన్నిటిని కలిపి వేసి మిక్స్ మెత్తగా చేయాలి.
  4. ఈ పుదినా టమాటో చట్నీ చాల రుచిగా ఉంటుంది.