Advertisement

Main Ad

Egg Kurma | Mutta Curry

Egg Kurma | Mutta Curry


తయారికి కావలసిన పదార్థాలు : 


  1. ఉడకపెట్టిన కోడి గుడ్లు : 4
  2. సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు : 2 
  3. టమాటో పేస్టు : 1/2 కప్పు 
  4. కొబ్బరి తురుము : 1 కప్పు 
  5. పసుపు, ఉప్పు, కారం : తగినంత 
  6. కాజు : 8 
  7. సోంపు పొడి : 1స్పూన్ 
  8. పచ్చిమిర్చి : 3 
  9. వెల్లులి రిబ్బలు : 5
  10. ధనియా పొడి : 1స్పూన్ 
  11. గరం మసాలా : 1 స్పూన్ 
  12. కరివెయపకు , కొత్తిమిర 
  13. నూనె 

తయారి చేయు విధానం : 



  • స్టవ్ ఫై కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి ఉడకపెట్టిన గుడ్లను వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి పక్కనపెట్టుకోవాలి. 
  • ముందుగా కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, వెల్లులి రిబ్బలు, కాజు, సోంపు పొడి, దనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు, కారం వేసి వీటన్నిటిని కలిపి మిక్స్ పట్టి తగినన్ని నీళ్ళు పోసి పేస్టు లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. 
  • స్టవ్ ఫై పెట్టిన అదే కడాయి లో 5 స్పూన్స్ నునె వేసి వేడి ఇయక సన్నగా తరిగిన ఉల్లిగడ్డలను వేసి వేగాక కరివేపాకు వేసి తరువాత మనం తయారు చేసిన మసాలను వేసి కలుపుకోవాలి, తరువాత టమాటో పేస్టు వేసి బాగా మగ్గనివ్వాలి. 
  • ఇలా 10 నిమిషాల పాటు మగ్గాక నూనె  పైకి తేలాక ఫ్రై చేసిన గుడ్లను వేసి కలిపి కొత్తిమిరను కూడా వేసి కలుపుకోవాలి. 
  • ఈ కుర్మా చేపతి లోనికి చాల రుచిగా ఉంటుంది .