Coconut Chutny | Kobbari Chutney

Coconut Chutney | Kobbari Chutney






తయారికి కావలసిన పదార్థాలు :

  1. పచ్చి కొబ్బరి : 2 కప్పులు
  2. పచ్చిమిర్చి : 6
  3. ఎండుమిర్చి : 2
  4. పుట్నాల పప్పు : 1/2 కప్పు
  5. చింతపండు : చిన్న నిమ్మకాయ అంత
  6. ఉప్పు
  7. పసుపు
  8. నూనె
  9. ఆవాలు , జీలకర్ర : 1 స్పూన్
  10. ఇంగువ పొడి : చిటికెడు
  11. వెల్లులి రిబ్బలు : 6
  12. మినపప్పు : 1 స్పూన్
  13. కరివేపాకు , కొత్తిమీర

తయారు చేయు విధానం : 

  • స్టవ్ ఫై కడాయి పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించి వాటిని మిక్స్ జార్లో తీసుకోవాలి.
  • ఇందులోనే వెల్లుల్లి, జీలకర్ర, నారా లేని చింతపండు, పుట్నాల పప్పు, కొత్తిమీర వేసి ఒక సారి మిక్స్ చేసి కొన్ని నీళ్ళు పోసి మరో సారి మెత్తగా అయ్యేవరకు మిక్స్ చేయాలి. సరిపడినంత ఉప్పు వేసి రుచి చూసుకోవాలి.
  • పోపు కి చిన్న కడాయి స్టవ్ ఫై పెట్టి 2స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర,  మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు మరియు కరివేపాకు వేసి పోపు చేసుకొని ఈ పోపుని కొబ్బరి చట్నిలో వేసి కలుపుకోవాలి. 
  • ఈ చట్ని ఇడ్లి, దోస, వడ లోకి చాల రుచిగా ఉంటుంది.

Coriander Mint Chutney | Mint and Coriander Chutney | Green Chutney

Coriander Mint Chutney | Mint Coriander Chutney | Green Chutney


తయారికి కావలసిన పదార్థాలు :

  1. పుదినా : 2 కప్పులు
  2. కొత్తిమీరా : 2 కప్పులు
  3. మినపప్పు : 1/2 కప్పు
  4. శెనగ పప్పు : 1/2 కప్పు
  5. చింతపండు : రుచికి తగినంత
  6. పసుపు : 1 స్పూన్
  7. ఉప్పు : తగినంత
  8. పచ్చిమిర్చి : 8
  9. ఎండుమిర్చి : 2
  10. అల్లం ముక్కలు : 1 స్పూన్
  11. వెల్లుల్లి రిబ్బలు : 5
  12. జీలకర్ర ; 1 స్పూన్
  13. నూనె

తయారు చేయు విధానం :

  • స్టవ్ ఫై కడాయి పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి అందులో మినపప్పు, శెనగ పప్పు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకున్నాక వాటిని తీసి మిక్స్ జార్లో వేసాక పచ్చిమిర్చి,  ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
  • వీటిని తీసి పుదినా, కొత్తిమీరాను, పసుపు వేసి పచ్చి వాసన పోయే అంత వరకు వేయించుకోవాలి.
  • చింతపండును నీళ్ళలో వేసి నానపెట్టుకోవాలి.
  • పప్పులను మిక్స్ చేసాక పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి ఆకులను, చింతపండు, సరిపడినంత ఉప్పు వేసి వీటిని బాగా మెత్తగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి.
  • ఈ పుదినా కొత్తిమిర చట్నీ ఆరోగ్యానికి చాల మంచిది.

Mint Tomato Chutney | పుదీనా టమాటో చట్నీ

Mint Tomato Chutney | పుదీనా టమాటో చట్నీ


తయారికి కావాల్సిన పదార్థాలు :

  1. పుదీనా : 2 కప్పులు
  2. టమాటో : 1 కప్పు
  3. పచ్చిమిర్చి : 4
  4. ఎండుమిర్చి : 3
  5. నువ్వులు : 1/2 కప్పు
  6. చింతపండు : పులుపుకి తగినంత
  7. జీలకర్ర : 1 స్పూన్
  8. పసుపు , ఉప్పు
  9. వెల్లులి రిబ్బలు : 6
  10. నూనె

తయారు చేయు విధానం :

  1. స్టవ్ ఫై కడాయి  పెట్టి మొదటగా నువ్వులు దోరగా వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
  2. అదే కడాయి లో కొద్దిగా నూనె పోసి జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రిబ్బలు చింతపండు వేసి వేయించుకున్నాక  పుదినా, పచ్చిమిర్చి వేసి 5 నిమిషాల పాటు మగ్గించుకున్నాక చివరగా టమాటో వేసి మగ్గినతరువాత సరిపడినంత ఉప్పు వేసి స్టవ్ కట్టేయాలి.
  3. తరువాత మిక్స్ జర లో అన్నిటిని కలిపి వేసి మిక్స్ మెత్తగా చేయాలి.
  4. ఈ పుదినా టమాటో చట్నీ చాల రుచిగా ఉంటుంది.

Mint Chuney with Red Chilli | Pudina Endumirchi Chutney

Mint Chutney with Red Chilli | పుదీనా ఎండుమిర్చి చట్నీ


తయారికి కావలసిన పదార్థాలు :

  1. పుదీనా : 2 కప్పులు
  2. నువ్వులు : 1/2 కప్పు
  3. చింతపండు : పులుపుకి తగినంత
  4. ఎండుమిర్చి : 8
  5. జీలకర్ర : 1 స్పూన్
  6. వెల్లుల్లి రిబ్బలు : 6
  7. ధనియాలు : 2 స్పూన్స్
  8. పసుపు, ఉప్పు
  9. నూనె

తయారీ చేయు విధానం : 

  • స్టవ్ ఫై కడాయి పెట్టి 1/2 కప్పు నువ్వులను వేసి దోరగా వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. 
  • అదే కడాయి లో 4 స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, వెల్లులి రిబ్బలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకున్నాక వాటిని తీసి మిక్స్ జార్ లో వేసి మరల అదే కడాయి లో 2 స్పూన్స్ నూనె వేసి కడిగి ఆరపెట్టిన పుదినా ఆకులను వేసి పచ్చి వాసనా పోయే అంత వరకు వేయించుకున్నాక అందులో చింతపండు వేసి పసుపు, సరిపడినంత ఉప్పు వేసి కలిపి మిక్స్ జార లో వేసి మెత్తగా మిక్స్ చేసుకోవాలి.
  • ఇష్టం ఉంటె పోపు దినుసులు వేసి పోపు పెట్టుకోవచ్చు.

Recipe For Methi Paratha | Methi Roti

Recipe For Methi Paratha | Methi Roti


తయారికి కావలసిన పదార్థాలు :

  1. మెంతి కూర ఆకులూ : 2 కప్పులు
  2. పసుపు, ఉప్పు, కారం : తగినంత
  3. తరిగిన ఉల్లిగడ్డలు : 1/2 కప్పు
  4. పచ్చిమిర్చి : 2
  5. ఇంగువ పొడి : చిటికెడు
  6. జీలకర్ర : 1 స్పూన్
  7. నెయ్యి
  8. నూనె
  9. గోధుమ పిండి : 2 కప్పులు

తయారు చేయు విధానం :

  • మెంతి కూర ఆకులను కడిగి సన్నగా తురుముకొని దానిలో జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి మరియు  ఇంగువ పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
  • గోధుమ పిండి లో ఫై న కలిపిన మెంతి మిశ్రమాన్ని వేసి కొంచెం నూనె వేసి కలిపి తరువాత నీళ్ళు పోసి కలిపి చెపాతి పిండిలాగా మెత్తగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
  • పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని చెపాతిలాగా చేసి పెనం ఫై నెయ్యి వేసి దోరగా కాల్చుకోవాలి.
  • ఈ మెంతి పరోట ఆరోగ్యానికి చాల మంచిది . 
  • ఈ పరోటలను పెరుగుతో తింటే చాల రుచిగా ఉంటాయి.