స్టవ్ ఫై కడాయి పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముక్కలు, శెనగ పప్పు, కాజు వేసి కొంచెం వేగిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు కూడా వేసి కాసేపు మగ్గాక తరిగిన టమాటో ముక్కలను కూడా వేసి బాగా మగ్గనివ్వాలి.
ఇప్పుడు వంకాయలను కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా మగ్గుతున్న మిశ్రమంలో వేయాలి, అవసరం ఐతే కొన్ని వాటర్ పోసుకొని మగ్గనివ్వాలి.
కొంచెం చల్లారిన తరువాత వీటిని మిక్స్ జార్లో వేసి మిక్స్ చేసాక సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
స్టవ్ ఫై చిన్న కడాయి పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ కూడా వేసి పోపును పచ్చడిలో వేసి కలుపుకోవాలి చివరగా కొత్తిమిర చల్లుకోవాలి.