Dahi Baingan | Curd Brinjal | Eggplant with Yogurt
తయారికి కావలసిన పదార్థాలు :
వంకాయలు : 150 గ్రా
పెరుగు : 2 కప్పు లు
ఆవాలు, జీలకర్ర : 1 స్పూన్
పచ్చిమిర్చి : 4
ఎండుమిర్చి : 3
అల్లం ముక్కలు : 1 స్పూన్
వెల్లుల్లి ముక్కలు : 1 స్పూన్
నూనె
పసుపు : 1/2 స్పూన్
ఉప్పు : తగినంత
కరివేపాకు, కొత్తిమిర
తయారి చేయు విధానం :
వంకాయలను కడిగి పొడుగ్గా కట్ చేసుకొని తడి లేకుండా చూసుకొని వాటిమీద పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ ఫై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడినంత నూనె పోసి మరిగించాకా ఈ వంకాయలను వేసి బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
ఒక పెద్ద గిన్నె తీసుకోని అందులో పెరుగు వేసుకొన్నాక కొన్ని నీళ్లు పోసి చిలకాలి, ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి, వంకాయలను కూడా వేసి కలుపుకోవాలి.
స్టవ్ ఫై కడాయి పెట్టి పోపు కి తగినంత నూనె పోసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేయ్పకు, వెల్లుల్లి రిబ్బలు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకున్నాక దాన్ని పెరుగులో వేసి కలిపిన తరువాత కొత్తిమిర చల్లుకోవాలి.