Advertisement

Main Ad

Brinjal Fry | Egg Plant Fry | వంకాయ వేపుడు

Brinjal Fry | Eggplant Fry | వంకాయ వేపుడు

 

తయారికి కావలసిన పదార్థాలు :

  1. వంకాయలు : 250 గ్రా
  2. తరిగిన ఉల్లిగడ్డలు : 1 కప్పు
  3. పచ్చిమిర్చి : 5
  4. కరివేపాకు, కొత్తిమిర
  5. పసుపు, ఉప్పు, కారం : తగినంత
  6. మసాలా దినుసులు  1/2 స్పూన్
  7. పోపు దినుసులు : 1 స్పూన్
  8. మినపప్పు : 1 స్పూన్
  9. పల్లీలు : 1 స్పూన్
  10. ధనియాల పొడి : 1 స్పూన్
  11. వెల్లుల్లి రిబ్బలు : 5
  12. అల్లం వెల్లులి పేస్టు : 1 స్పూన్
  13. నూనె

తయారు చేయు విధానం :

  • వంకాయలను కడిగి సన్నగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్ ఫై కడాయి పెట్టి ఫ్రై కి తగినంత నూనె వేసి వేడి అయ్యాక మసాలా దినుసులు, పోపు దినుసులు వేసి వేగాక మినపప్పు, పల్లీలు వేసి బాగా వేగిన తరువాత పచ్చిమిర్చి,  వెల్లులి రిబ్బలు, కరివేపాకు వేయాలి. 
  • ఆ తరువాత తరిగిన ఉల్లి ముక్కలను వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం వేగిన తరువాత తరిగిన వంకాయ ముక్కలను వేసి మూత పెట్టాలి.
  • 3 - 5 నిమిషాల తరువాత మూత తీసి చూస్తే వంకాయ కాస్త మగ్గుతుంది. ఇపుడు 1/2 స్పూన్ పసుపు వేసి కలిపాక ఫ్రై కి తగినంత ఉప్పు, కారం వేసుకొని ఇంక కాసేపుమగ్గనివ్వాలి.
  • చివరగా ధనియాల పొడి, కట్ చేసుకున్న కొత్తిమీర చల్లి మూత లేకుండా ఫ్రై చేసుకోవాలి.
  • ఇపుడు స్టవ్ కట్టేయాలి