Advertisement

Main Ad

Fried Eggplant With Chickpeas | Brinjal Fry with Cabuli Chana Curry

Fried Eggplant With Chickpeas | Brinjal Fry with Cabuli Chana Curry


తయారికి కావాల్సిన పదార్థాలు :

  1. వంకాయలు : 250 గ్రా 
  2. కాబూలి శెనగలు : 100 గ్రా 
  3. కరివేపాకు , కొత్తిమిర 
  4. నూనె 
  5. పసుపు , ఉప్పు , కారం : తగినంత 
  6. గరం మసాలా పొడి : 1 స్పూన్ 
  7. తరిగిన ఉల్లిగడ్డలు : 1 కప్పు 
  8. తరిగిన టమాటోలు : 1 కప్పు 
  9. వెల్లులి రిబ్బలు : 8 
  10. ధనియాల పొడి : 1 స్పూన్ 

తయారు చేయు విధానం : 

  • వంకాయలను కడిగి సన్నగా స్లైస్ లాగా కట్ చేసుకున్నాక స్టవ్ ఫై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి తగినంత నూనె పోసి వేడెక్కాక వంకాయ ముక్కలను వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి . 
  • శేనగలను 4 గంటల పాటు ననపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి . 
  • స్టవ్ ఫై గిన్నె పెట్టి ఫ్రై కి తగినంత నూనె పోసి తరిగిన ఉల్లిగడ్డలను , కొంచెం నలిపిన వెల్లులి రిబ్బాలను వేసి కొంచెం వేగాక సన్నగా తరిగిన టమాటో ముక్కలను వేసి వేగాక శేనగాలను వేసాక పసుపు వేసి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి . 
  • ఇపుడు ఫ్రై చేసిన వంకాయ ముక్కలను వేసి తగినంత ఉప్పు , కారం , గరం మసాలా , దనియాల పొడి మరియు కొత్తిమిర చల్లుకొని 2 నిమిషాల తరువాత స్టవ్ కట్టేయాలి . 
  • ఈ కూర అన్నం , చేపాతి లోకి చాల రుచిగా ఉంటుంది .